Budda Venkanna: మూడు రత్నాలతో స్థానిక ఎన్నికల్లో గెలిచారు: బుద్ధా వెంకన్న ఎద్దేవా

YSRCP won with three ratnas says Budda Venkanna
  • స్థానిక ఎన్నికల్లో గెలుపు వాపును చూసి బలుపనుకుంటున్నారు 
  • డబ్బు, అధికారం, పోలీస్ అనే మూడు రత్నాలతో గెలిచింది
  • రియలెస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదన్న వెంకన్న 
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వాపును చూసి వైసీపీ నేతలు బలుపనుకుంటున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. డబ్బు, అధికారం, పోలీస్ అనే మూడు రత్నాలతో వైసీపీ గెలిచిందని అన్నారు. తిరుపతి ఉపఎన్నికను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తే... నోటా కంటే తక్కువ ఓట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు.

వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని... ఆ పార్టీకి అడ్డుకట్ట వేయగలిగేది టీడీపీ మాత్రమేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలవడంతో... రాష్ట్రంలో రియలెస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News