Mamata Banerjee: వీల్‌చైర్‌లో కూర్చొని 'పాదయాత్ర‌'లో పాల్గొన్న మ‌మ‌తా బెన‌ర్జీ.. వీడియో ఇదిగో

 Mamata Banerjee participates in padayatra
  • ఇటీవ‌ల మ‌మ‌త‌ కాలికి గాయం
  • ప్ర‌స్తుతం నందిగ్రామ్ నియోజ‌క వ‌ర్గంలో మ‌మ‌త ప్ర‌చారం
  • కుదీరామ్ మోర్ నుంచి ఠాకూర్ చౌక్ వ‌ర‌కు పాద‌యాత్ర  ‌
ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాలికి గాయ‌మైన విష‌యం తెలిసిందే. కాలికి వైద్యులు క‌ట్టిన‌ క‌ట్టుతోనే ఆమె వీల్‌చైర్‌లో కూర్చొని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాను పోటీ చేయనున్న నందిగ్రామ్ నియోజ‌క వ‌ర్గంలో.. మ‌మ‌తా బెన‌ర్జీ వీల్‌చైర్ లో కూర్చొని పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాద‌యాత్ర చేశారు. ఆమె వెంట‌ భారీగా టీఎంసీ నేత‌లు స్థానికులు ర్యాలీలో పాల్గొన్నారు.

కుదీరామ్ మోర్ నుంచి ఠాకూర్ చౌక్ వ‌ర‌కు ఆమె పాద‌యాత్ర నిర్వ‌హించారు. నందిగ్రామ్‌లో మార్చి 28వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు గ‌డ‌పనున్నట్లు ఇప్ప‌‌టికే ఆమె ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 1న‌ రెండ‌వ ద‌శ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నియోజ‌క వ‌ర్గంలో ఆమెపై బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.
Mamata Banerjee
tmc
West Bengal

More Telugu News