sharad pawar: శ‌ర‌ద్ ప‌వార్‌కు అస్వ‌స్థ‌త.. ఎల్లుండి ఆప‌రేష‌న్‌

sharad pawar joins in hospital
  • పొత్తి కడుపులో నొప్పి
  • ముంబైలోని ఆసుప‌త్రిలో చికిత్స‌
  • ఆయన పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దు
నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఆయ‌నకు పొత్తి కడుపులో నొప్పి వ‌చ్చింద‌ని, వెంట‌నే ఆయ‌నను కుటుంబ స‌భ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్ ట్వీట్ చేశారు.  

ఆరోగ్య పరీక్షలు నిర్వ‌హించిన‌ వైద్యులు శ‌ర‌ద్ ప‌వార్ పిత్తాశయంలో సమస్య ఉన్న‌ట్లు గుర్తించార‌ని న‌వాబ్ మాలిక్ చెప్పారు. ఆయనకు ఎల్లుండి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని వివ‌రించారు. ఆయన పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయని తెలిపారు.  
sharad pawar
ncp
Maharashtra

More Telugu News