Paritala Sriram: జనాలు ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి: పరిటాల శ్రీరామ్

  • వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు
  • వాలంటీర్ల ద్వారా పెత్తందారీ విధానాలను అమలు చేస్తున్నారు
  • కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెట్టారు
వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. జగన్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని... వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డుపెట్టుకుని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలిచిందని అన్నారు. గ్రామాలలోని ప్రజలు ఎదురుతిరిగే రోజులు వస్తాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాప్తాడులో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందని శ్రీరామ్ అన్నారు. ముష్టికోవెలలో టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. కర్ణాటక మద్యం రాకెట్ ను పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పాలనే లేదని... ఒక స్టార్టప్ కంపెనీలా వ్యవహరిస్తోందని చెప్పారు. టీడీపీ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు.
Paritala Sriram
Telugudesam
YSRCP

More Telugu News