Vijay Sai Reddy: మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు: సోము వీర్రాజుపై విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

vijaya sai slams bjp janasena
  • తిరుపతి ఉప ఎన్నికల నేప‌థ్యంలో డ్రామాల‌ని వ్యాఖ్య‌
  • జనం నవ్వుకుంటున్నారని విమ‌ర్శ‌
  • జనం మళ్లీ వైసీపీనే దీవిస్తారన్న విజ‌య‌సాయిరెడ్డి
ప్ర‌ధాని మోదీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే చాలా అభిమానం అని, ఆయ‌న‌ను రాష్ట్రానికి అధిప‌తిని చేయాల‌న్న ఆలోచ‌న త‌మ పార్టీకి ఉంద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలోనే ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

'తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
.
Vijay Sai Reddy
YSRCP
Janasena
BJP
Somu Veerraju

More Telugu News