Congress: ఉచిత కరోనా వ్యాక్సిన్‌, నీట్‌ పరీక్ష రద్దు వంటి హామీలతో పుదుచ్చేరి కాంగ్రెస్‌ మేనిఫెస్టో

  • సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ చేతుల మీదుగా విడుదల
  • నూతన విద్యా విధానం
  • గృహిణులకు రూ. 1000 ఆర్థిక సాయం
  • పుదుచ్చేరి వర్సిటీలో స్థానికులకు 25 శాతం కోటా
  • అన్ని ఇళ్లకు ఉచిత మంచినీటి సరఫరా
Puducherry congress Manifesto Released

పుదుచ్చేరి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌, నీట్‌ పరీక్ష రద్దు, నూతన విద్యా విధానం, గృహిణులకు రూ. 1000 ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబ సభ్యులకు ఫించను పెంపు వంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ పుదుచ్చేరిలో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించడం, పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్థానికులకు అన్ని కోర్సుల్లో 25 శాతం కోటా, అన్ని ఇళ్లకు ఉచిత మంచినీటి సరఫరా, వితంతువులు, నిరాశ్రయులైన మహిళలకు ఫించను రూ.ఐదు వేలకు పెంపు వంటి హామీలను ఇందులో పొందుపరిచారు. ఇవేకాకుండా... విద్యార్థులకు 60 జీబీ డేటా, ల్యాప్ టాప్ లు, వైఫై సదుపాయాలు, ఉచిత బస్ పాస్ లు అంటూ ఆకర్షణీయ పథకాలను మేనిఫెస్టోలో వివరిం

More Telugu News