Telangana: లాభసాటి పంటలపై దృష్టి సారించండి... తెలంగాణ రైతులకు మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచన

  • సిద్ధిపేటలో ఆయిల్‌ పామ్‌ అవగాహన సదస్సు
  • పాల్గొన్న హరీశ్‌రావు, నిరంజన్‌ రెడ్డి
  • ఆయిల్‌ పామ్‌ సాగుకు అండగా నిలవాలని కేంద్రానికి లేఖ
  • కేంద్రం నుంచి నిరాశజనక సమాధానం వచ్చిందన్న నిరంజన్‌
Go for profitable crops suggests Niranjan Reddy

రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. సిద్ధపేట జిల్లా పొన్నాల చౌరస్తా వద్ద నిర్వహించిన ఆయిల్‌ పామ్‌ అవగాహనా సదస్సులో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించడంలేదని విమర్శించారు.  

కానీ తాము సాగుకు అనువైన అనేక ప్రోత్సాహకాలను రైతులకు అందజేస్తున్నామని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌ పామ్‌ సాగుకు అండగా నిలవాలని కోరుతూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అందుకనుగుణంగా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు.

కానీ, కేంద్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. ఆయిల్‌ పామ్‌కు తెలంగాణ భూములు, వాతావరణం అనువైనవా? కాదా? అనే అంశం పరిశీలించి నిర్ణయిస్తామంటూ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. 

More Telugu News