Ananda Prasad: టాలీవుడ్ సినీ నిర్మాత ఆనంద ప్రసాద్ పై చీటింగ్ కేసు

Cheating case against Tollywood producer Ananda Prasad
  • కోటి రూపాయలు తీసుకుని ఎగవేశాడంటూ ఆరోపణలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తి
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేసిన పోలీసులు
  • అందుబాటులో లేకుండా పోయిన ఆనంద ప్రసాద్
బాలకృష్ణ, నితిన్, గోపీచంద్ వంటి హీరోలతో తెలుగులో సినిమాలు నిర్మించిన టాలీవుడ్ నిర్మాత ఆనంద ప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదైంది. తన నుంచి రూ.1 కోటి రుణంగా తీసుకున్నారని, కానీ ఇంతవరకు తీర్చలేదని సత్యనారాయణ అనే వ్యక్తి ఆనంద ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆనంద ప్రసాద్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులపైనా చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఆనంద ప్రసాద్ ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు. దాంతో ఆయన పరారీలో ఉన్నట్టు భావిస్తున్నారు.

భవ్య సిమెంట్స్, కన్ స్ట్రక్షన్స్ పేరిట ఇతర వ్యాపారాలు చేపడుతున్న ఆనంద ప్రసాద్ సినిమాలపై ఆసక్తితో నిర్మాతగానూ కొనసాగుతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై బాలయ్యతో పైసా వసూల్, నితిన్ తో చెక్, గోపీచంద్ తో వాంటెడ్, లౌక్యం, శౌర్యం వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఆయనను భవ్య ఆనంద ప్రసాద్ అని పిలుస్తుంటారు.
Ananda Prasad
Cheating
Bhavya Creations
Tollywood

More Telugu News