Mukku Avinash: బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాశ్ తల్లికి తీవ్ర అనారోగ్యం.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయం

Financial help to Mukku Avinash after his mother hospitalised
  • అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన అవినాశ్ తల్లి
  • భారంగా మారిన వైద్య ఖర్చులు
  • ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు
  • సానుకూలంగా స్పందించిన సర్కారు
  • సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.60 వేలు మంజూరు
బిగ్ బాస్-4 రియాల్టీ షో ద్వారా గుర్తింపు పొందిన నటుడు ముక్కు అవినాశ్ తల్లి లక్ష్మీరాజం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చికిత్సకు భారీగా ఖర్చవుతుండడంతో అవినాశ్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం కోరగా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందింది.

ముక్కు అవినాశ్ స్వస్థలం జగిత్యాల జిల్లా రాఘవపట్నం (గొల్లపల్లి మండలం). ఇటీవలే అవినాశ్ తల్లి కాళ్ల లక్ష్మీరాజం అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే, వైద్య ఖర్చులు అధికంగా ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. అవినాశ్ కుటుంబ సభ్యుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేలు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన చెక్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ నటుడు ముక్కు అవినాశ్ కు అందజేశారు. ఈ సందర్భంగా అవినాశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Mukku Avinash
CMRF
Lakshmirajam
Koppula Eshwar
Telangana

More Telugu News