Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ రాక్ స్టార్ స్టెప్పులకు ప్రభుదేవా ఫిదా

 Devi Sri Prasad said Prabhudeva called him after energetic dance moments in Rockstar promo
  • తమిళ బుల్లితెరపై దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీ
  • రాక్ స్టార్ పేరుతో జీ తమిళ్ చానల్లో మ్యూజిక్ ప్రోగ్రాం
  • ప్రోమో వీడియోలో అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన డీఎస్పీ
  • ప్రభుదేవా ఫోన్ చేసి అభినందించారని వెల్లడించిన దేవి శ్రీ
దక్షిణాది చిత్రాల హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇటీవలే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ సారథ్యంలో జీ తమిళ్ చానల్ రాక్ స్టార్ అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రోమో వీడియోలో డీఎస్పీ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు. ఈ ప్రోమో వీడియోలో డీఎస్పీ డ్యాన్సులు అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనిపై దేవి శ్రీ ప్రసాద్ ఓ ట్వీట్ లో వెల్లడించాడు.

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా మాస్టర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనను థ్రిల్ కు గురిచేసిందని తెలిపాడు. రాక్ స్టార్ ప్రోమో వీడియోలో తాను వేసిన స్టెప్పుల పట్ల ప్రభుదేవా మాస్టర్ ప్రశంసల జల్లు కురిపించారని, అంతకంటే ఇంకేం కావాలని దేవి శ్రీ ప్రసాద్ పేర్కొన్నాడు. మిమ్మల్ని ఎప్పుడూ అభిమానిస్తుంటాం మాస్టర్... అయితే ఇలాంటి ప్రశంసలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు అని వివరించాడు.
Devi Sri Prasad
Prabhudeva
Dance
Rockstar
Promo
Zee Tamil

More Telugu News