Snake Venom: 200 పాముల నుంచి.. రూ.కోటి విలువైన లీటర్​ విషం!

Snake Venom Worth Over 1 Crore Seized In Odisha 6 Arrested
  • అక్రమంగా తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్
  • ఒడిశాలోని బాలాసోర్ లో ఘటన
  • రూ.10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారన్న అధికారులు
పాము విషాన్ని తీసి అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ వో) అశోక్ మిశ్రా వెల్లడించారు.

లీటర్ విషాన్ని సీజ్ చేశామని చెప్పారు. దాంతో పాటు ఐదు మిల్లీలీటర్ల చొప్పున ఉన్న 5 వయల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం రూ.కోటి దాకా ఉంటుందని చెప్పారు.


బాలాసోర్ కు చెందిన ఓ మహిళ సహా ముగ్గురు సభ్యుల ముఠా రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుందని తెలిపారు. డీల్ ప్రకారం 200 త్రాచు పాముల నుంచి లీటర్ విషాన్ని తీశారని చెప్పారు. వారితో పాటు కేసుతో సంబంధమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
Snake Venom
Odisha

More Telugu News