రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మంగళవారం బైపాస్ ప్రక్రియ
- ఛాతీలో అసౌకర్యంతో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి
- ఆర్మీ ఆసుపత్రి నుంచి నేడు ఎయిమ్స్ కు తరలింపు
- ఎయిమ్స్ లో కోవింద్ కు వైద్య పరీక్షలు
- ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న రాష్ట్రపతి భవన్
అయితే, వైద్య పరీక్షల అనంతరం రామ్ నాథ్ కోవింద్ కు మంగళవారం బైపాస్ ప్రక్రియ నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపింది. ఎయిమ్స్ వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించింది.