Ramcharan: జన్మదినం సందర్భంగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం 

Tollywood hero Ram Charan photos displayed on New York Times Square billboard
  • న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై చరణ్ ఫొటోలు
  • చరణ్ ను అలా చూడడం అద్భుతంగా ఉందన్న ఉపాసన
  • ఇదొక తియ్యని అనుభూతి అని వెల్లడి
  • ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్
న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ భవంతి ఇక్కడే ఉంది. అయితే ఈ భవంతి వద్ద ఏర్పాటు చేసిన బిల్ బోర్డుపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫొటోలు ప్రదర్శించడం విశేషం అని చెప్పాలి. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో టైమ్స్ స్క్వేర్ వద్ద స్లైడ్ షో వేశారని ఉపాసన వెల్లడించారు. ఇదొక మధురమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై చరణ్ ఫొటోలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోందని, ఇంతటి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. కాగా, టైమ్స్ స్క్వేర్ పై ఈ అరుదైన గౌరవాన్ని పొందిన తొలి సౌతిండియా నటుడు రామ్ చరణ్ కావడం విశేషం.


ఈ ఏడాది మాకు చిరస్మరణీయం కానుంది: ఎన్టీఆర్

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న ప్రాణస్నేహితుల ప్రస్తావన వస్తే వాళ్లిద్దరి గురించి కూడా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ఈ ఏడాది తమకు చిరస్మరణీయం కానుందని పేర్కొన్నారు. "సోదరా... నీతో గడిపిన క్షణాలు ఎల్లప్పటికీ నిలిచిపోతాయి" అని వివరించారు. దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందిస్తూ 'భీమ్ అండ్ రామరాజు' అంటూ ట్వీట్ చేసింది.

Ramcharan
Birthday
Times Square Billboard
New York
USA
Upasana
RRR
Junior NTR
Tollywood

More Telugu News