Ayyanna Patrudu: చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారే తప్ప రెండేళ్లుగా ఏం నిరూపించారు?: సజ్జలకు అయ్యన్న కౌంటర్

Ayyanna counters to Sajjala comments on Chandrababu
  • అమరావతి అంశంలో చంద్రబాబుపై సజ్జల వ్యాఖ్యలు
  • సజ్జల అనవసరంగా మాట్లాడుతున్నారన్న అయ్యన్న
  • రైతుల ఆమోదంతో ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు వివరణ
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శ   
అమరావతిలో లాండ్ పూలింగ్ పేరిట రైతుల భూములు లాగేసుకున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రాజధాని విషయంలో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని రెండేళ్లుగా అంటూనే ఉన్నారని, అయితే, ఇప్పటివరకు ఏమీ నిరూపించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుపై సజ్జల అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతుల సమ్మతితో ల్యాండ్ పూలింగ్ చేపడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అయ్యన్న ప్రత్యారోపణలు చేశారు. ఈ అంశంలో వైసీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాము నిరూపిస్తామని స్పష్టం చేశారు.
Ayyanna Patrudu
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Insider Trading
Amaravati
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News