Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఎయిమ్స్‌కు త‌ర‌లించాం: ఆర్మీ ఆసుప‌త్రి

kovind being referred to AIIMS Delhi for further investigation
  • నిన్న కోవింద్‌కు ఛాతీ నొప్పి
  • ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న‌ వైద్యులు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిన్న‌ ఉదయం ఛాతీలో నొప్పితో బాధ‌ప‌డ‌డంతో ఆయ‌న‌ను వెంటనే ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ ఆసుప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆ ఆసుప‌త్రి తాజాగా వివ‌రించింది. రాష్ట్రపతి కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

కోవింద్‌కు మ‌రింత మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఆయ‌న‌ను ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఛాతీ నొప్పి కార‌ణంగా నిన్న ఆయ‌న‌ను ఆర్మీ ఆసుప‌త్రి వైద్యులు ప‌రిశీల‌న‌లో ఉంచి, చికిత్స అందించారు. మ‌రిన్ని వైద్య ప‌రీక్ష‌లు, చికిత్స కోసం ఎయిమ్స్‌కు త‌ర‌లించారు.
Ram Nath Kovind
India

More Telugu News