Paresh Rawal: వ్యాక్సిన్​ తీసుకున్న మూడు వారాల్లోనే బాలీవుడ్​ నటుడు పరేశ్​ రావల్​ కు కరోనా!

Paresh Rawal Tests COVID 19 Positive Weeks After First Vaccine Shot
  • ఈ నెల 9న టీకా మొదటి డోసు తీసుకున్న పరేశ్
  • శుక్రవారం కరోనా సోకినట్టు ట్వీట్
  • తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది. అయితే, ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా సోకింది. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.

వాస్తవానికి మార్చి 9నే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ‘వీ అంటే వ్యాక్సిన్స్! కరోనా సంక్షోభ సమయంలో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, ముందు వరుస యోధులైన ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులకు ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. టీకా తీసుకుని మూడు వారాలు కాకముందే ఆయనకు కరోనా సోకింది.
Paresh Rawal
Bollywood
COVID19
COVAXIN
Covishield

More Telugu News