Dia Mirza: పురుషులపై పర్యావరణ ప్రభావం.. స్కై న్యూస్ కథనాన్ని షేర్ చేసిన దియా మీర్జా

  • పర్యావరణ పరిరక్షణలో ముందుండే దియా  
  • ఇకనైనా ప్రపంచం సీరియస్‌గా తీసుకోవాలని ఆశ 
  • పెళ్లిని పూర్తి పర్యావరణ హితంగా చేసుకున్న నటి
Dia Mirza has an epic reaction to news on penises shrinking because of pollution

కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ ‘స్కై న్యూస్’లో ప్రచురితమైన కథనాన్ని ప్రముఖ మోడల్, నటి అయిన హైదరాబాదీ దియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ముందుండి, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు ఇచ్చే దియామీర్జా ఈ ఆర్టికల్‌ను షేర్ చేసి.. ‘‘ఇప్పుడైనా వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు మరింత సీరియస్‌గా దృష్టిసారిస్తాయనుకుంటా’’ అని పేర్కొంది. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది.

నిజానికి దియా మీర్జాకు పర్యావరణంపై శ్రద్ధ ఎక్కువ. అవకాశం దొరికిన ప్రతిసారీ గాలిలో కలుస్తున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, సహజ వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి గురించి ఉపన్యాసాలు ఇస్తుంటుంది. చెప్పడమే కాదు, ఆమె తన నిత్య జీవితంలో పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా నడుచుకుంటారు. ఆమె చేసే ప్రతీ పని పర్యావరణహితంగానే ఉంటుంది.

గత నెలలో వైభ్ రేఖి అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన దియా.. ఆ వేడుకను పూర్తి పర్యావరణ హితంగా నిర్వహించింది. కాగా, దియా తొలిసారి తెలుగులో నాగార్జున సరసన నటిస్తోంది. అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఓ ఎమోషనల్ పాత్రలో దియా మీర్జా నటిస్తోంది.

More Telugu News