తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్ల కుడి చేతికి సిరా చుక్క
- వచ్చే నెల 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
- ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు
- ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతోనే ఈ నిర్ణయం
తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే వారికి అధికారులు ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి సిరా గుర్తు పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు వారి ఎడమ చేతికి సిరా గుర్తు పెట్టారు. ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతో ఉప ఎన్నికలో కుడి చేతికి సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.