వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన ఇంగ్లండ్
- పూణేలో ఇంగ్లండ్ ఛేజింగ్
- స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు డౌన్
- 40 ఓవర్లలో 317/4
- ఇంకా 20 పరుగుల దూరంలో ఇంగ్లండ్
ఆ తర్వాత సెంచరీ హీరో బెయిర్ స్టో (124)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మరో వికెట్ చేజార్చుకుంది. అదే ఓవర్లో జోస్ బట్టర్ ను కూడా ప్రసిద్ధ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టన్ ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 20 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి.