మోదీ పర్యటనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో నిరసనలు.. ఆందోళనల్లో నలుగురి మృతి
- రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రధాని
- మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కొందరి ఆందోళన
- అదుపు చేసే క్రమంలో నలుగురి దుర్మరణం
మరోవైపు చిట్టగాంగ్‌లోనూ మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బులెట్లు ప్రయోగించినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు చెప్పారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఇద్దరు పాత్రికేయులతో పాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డట్లు సమాచారం.