Virat Kohli: రెండో వన్డేలో కోహ్లీ, రాహుల్ అర్ధసెంచరీలు... భారీస్కోరుపై కన్నేసిన భారత్

Kohli and Rahul completes fifties as India eyes huge total in second ODI against England
  • పూణేలో భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • మూడో వికెట్ కు 121 పరుగులు జోడించిన కోహ్లీ, రాహుల్
  • 66 పరుగులు చేసి అవుటైన కోహ్లీ
పుణేలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను కోహ్లీ, రాహుల్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు 121 పరుగులు జోడించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది.

అయితే 66 పరుగులు చేసిన కోహ్లీ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో అవుటవడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 32 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు కాగా... క్రీజులో కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్), రిషబ్ పంత్ ఆడుతున్నారు.  ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, శామ్ కరన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Virat Kohli
KL Rahul
Team India
England
2nd ODI
Pune

More Telugu News