Vijayasai Reddy: టీడీపీకి కట్టప్పను మించిన బానిస..: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Setires on Chandrababu
  • పరిషత్ ఎన్నికల వాయిదాపై సెటైర్లు
  • తిరుపతి ఫోబియాతో వణుకుతున్న చంద్రబాబు
  • డిపాజిట్లు కూడా రావని తెలుసన్న విజయసాయి 
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కట్టప్పను మించిన బానిసతో ఈ ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించాడని ఎవరి పేరునూ వెల్లడించకుండా సెటైర్లు వేశారు.

"కట్టప్పను మించిన పెద్ద బానిసతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వాయిదా వేయించాడు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ఫోబియాతో గజగజ వణుకుతున్నాడు. డిపాజిట్లు కూడా రావని తెలుసు. ప్రచారానికి వెళ్తే మొహం చూసే వారుండరు. సొంత జిల్లాలోనే వింత పరిస్థితి చంద్రబాబుకు" అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
Vijayasai Reddy
Chandrababu
Telugudesam
Tirupati

More Telugu News