Raghu Rama Krishna Raju: ఎస్‌బీఐ ఫిర్యాదు.. ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్

  • వ్యాపారం కోసం బ్యాంకు నుంచి రూ. 237.84 కోట్ల రుణం
  • తీసుకున్న రుణాన్ని అక్రమంగా దారి మళ్లించారన్న అభియోగాలు
  • రఘురామకు చెందిన పవర్ జనరేషన్ కంపెనీ, దాని 9 మంది డైరెక్టర్లపైనా కేసులు
CBI Case Files Against Raghu Rama Krishna Raju

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ ఢిల్లీ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యాపారం కోసం ఎంపీ రూ. 237.84 కోట్ల రుణం తీసుకుని దానిని దారి మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. ఇవే ఆరోపణలపై చెన్నై ఎస్‌బీఐ ఎస్ఏఎంబీ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.రవిచంద్రన్ ఈ నెల 23న చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ఎంపీకి చెందిన ఇండ్ భారత్ పవ్ జెన్‌కమ్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డైరెక్టర్లు 9 మందిపై కేసులు నమోదు చేసింది.

నిందితులందరూ కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటు ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం తదితర నేరాలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణాలను కుట్ర పూరితంగానే దారి మళ్లించారని అందులో పేర్కొంది.

More Telugu News