Complaint: జాతిరత్నాలు సినిమాను నిషేధించాలంటూ ఫిర్యాదు చేసిన శివసేన

Complaint on Jatiiratnalu movie
  • జాతిరత్నాలు చిత్రంపై కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు
  • దేశభక్తి ప్రబోధాత్మక గీతాన్ని కించపరిచారన్న శివసేన నేతలు
  • చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఇటీవలే విడుదలైన జాతిరత్నాలు
నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతిరత్నాలు. అయితే, ఇందులో దేశభక్తి ప్రబోధాత్మకమైన ఓ కవితను వ్యంగ్యంగా ఆలపించారని శివసేన తెలంగాణ విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరికొయ్యకు వేలాడే ముందే సర్ఫరోష్ కీ తమన్నా హబ్ హమారే దిల్ మే హై అంటూ పాడిన పాటను జాతిరత్నాలు చిత్రంలో అవమానకరీతిలో ఆలపించారని, ఆ గేయం పంక్తుల్లో టాలీవుడ్ హీరోయిన్ల పేర్చు చేర్చి వ్యంగ్యంగా మార్చేశారని శివసేన నేతలు ఆరోపించారు. ఈ మేరకు శివసేన తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి భూమా గంగాధర్, ఇతర నేతలు హైదరాబాదులోని కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచేలా వ్యవహరించిన సినిమా దర్శకుడు, నటీనటులు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ సినిమాను నిషేధించాలని అన్నారు. కాగా ఇటీవల విడుదలైన జాతిరత్నాలు చిత్రానికి ప్రజాదరణ లభిస్తోంది. వినోదాత్మక చిత్రంగా గుర్తింపు అందుకుంది.
Complaint
Jatiratnalu
Shivsena
Police
Telangana

More Telugu News