Osmania University: ఈ మ‌ధ్యాహ్నం నుంచి ఉస్మానియా యూనివర్శిటీ హాస్ట‌ల్స్ మూసివేత‌

OU hostels to close from this afternoon
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా మూత పడిన విద్యాసంస్థలు
  • ఇప్పటికే ఓయూ నుంచి వెళ్లిపోయిన పలువురు విద్యార్థులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేశారు. మళ్లీ ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఉస్మానియా యూనివర్శిటీతో పాటు ఇతర యూనివర్శిటీలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు.

ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉస్మానియా యూనివర్శిటీలోని అన్ని హాస్టళ్లను మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత హాస్టళ్లు మూతపడనున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పలువురు విద్యార్థులు హాస్టళ్ల నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News