Karthikeya-2: విపరీతంగా కురుస్తున్న మంచు.. 'కార్తికేయ-2' షూటింగ్ నిలుపుదల!

Karthikeya Sequel Shooting Stoped due to Heavy Snow
  • నిఖిల్ హీరోగా కార్తికేయ 2 
  • హిమాచల్ లో సినిమా చిత్రీకరణ
  • త్వరలోనే యాక్షన్ సీన్స్ తీస్తామన్న యూనిట్
దాదాపు ఏడుసంవత్సరాల క్రితం నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'కార్తికేయ'కు సీక్వెల్ గా నిర్మితమవుతున్న రెండో భాగం షూటింగ్ కు భారీ మంచు వర్షం ఆటంకాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న సిస్సులో జరుగుతుండగా, అక్కడ దట్టమైన మంచు కురుస్తోంది. దీంతో చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని వెల్లడించిన నిఖిల్, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేస్తున్నామని అన్నాడు. ఇదే లొకేషన్ లో పరిస్థితులు అనుకూలించిన తరువాత ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నామని తెలిపాడు. కాగా, ఈ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Karthikeya-2
Nikhil
Snlw
Himachal Pradesh
Shooting

More Telugu News