Petrol: ఎన్నికల వేళ... వరుసగా రెండో రోజూ తగ్గిన పెట్రోలు ధర!

Petrol Price Slashed Second Day
  • లీటరు పెట్రోల్ పై 21 పైసలు తగ్గిన ధర
  • 20 పైసల మేరకు తగ్గిన డీజిల్ ధర
  • హైదరాబాద్ లో రూ. 94.39కి తగ్గిన పెట్రోలు రేటు
ఇండియాలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నవేళ, వరుసగా రెండో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు లీటరు పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్‌ పై 20 పైసలు చొప్పున ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు సంస్థలు వెల్లడించాయి.

ఇక తాజా మార్పు తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.99 నుంచి రూ. 90.78కు తగ్గగా, డీజిల్ ధర రూ. 81.30 నుండి రూ. 81.10కు తగ్గింది. ఇతర నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో పెట్రోలు రూ. 97.19కు, డీజిల్‌ రూ. 88.20కు చేరగా, చెన్నైలో పెట్రోల్‌ రూ. 92.77, డీజిల్‌ రూ. 86.10కు చేరింది. హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ. 94.39గా ఉండగా, డీజిల్‌ ధర రూ.88.45కు తగ్గింది.
Petrol
Diesel
Price Slash

More Telugu News