India: ఈ సంవత్సరమే ఇండియాతో క్రికెట్ సిరీస్... పాక్ మీడియాలో ప్రముఖంగా వార్తలు!

  • ప్రస్తుతం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న రెండు దేశాలు
  • జూన్ తరువాత భారత్ లో ద్వైపాక్షిక సిరీస్
  • సిద్ధంగా ఉండాలని పీసీబీకి అందిన సమాచారం
Cricket Series with India this Year Says Pak Media

గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే పోటీ పడుతున్న ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఓ సిరీస్ ఉంటుందని పాకిస్థాన్ మీడియా ఓ వార్తను ప్రముఖంగా ప్రకటించింది.

జూన్ తరువాత రెండు దేశాల మధ్య సిరీస్ ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ వర్గాల నుంచి పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)కి సమాచారం అందిందట. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన ఓ పీసీబీ అధికారి, 2023లోజరిగే ఆసియా కప్ లో ఇండియా ఆడుతుందనే భావిస్తున్నట్టు పీసీబీ చైర్మన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా, 2012-13లో చివరిసారిగా ఓ క్రికెట్ సిరీస్ కోసం ఇండియాలో పాకిస్థాన్ పర్యటించింది. అంతకుముందు 2008లో ఆసియా కప్ కోసం ఇండియా జట్టు పాకిస్థాన్ కు వెళ్లింది. ఈ రెండు దాయాది దేశాల మధ్య చివరిగా 2019 వరల్డ్ కప్ లో భాగంగా ఓ మ్యాచ్ జరిగింది. ఆపై మరో మ్యాచ్ జరుగలేదు. ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ అంటే, అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News