Telangana: మంచిర్యాలలో విషాదం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

Family died by suicide in Mancherial dist
  • కుమార్తె, కుమారుడులతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య
  • వేర్వేరు గదుల్లో ఉరివేసుకున్న వైనం
  • ఇటీవలే అత్తింటి నుంచి వచ్చిన కుమార్తె
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

స్థానికంగా నివసించే రమేశ్, పద్మ దంపతులతోపాటు వారి కుమారుడు అక్షయ్ (17), కుమార్తె సౌమ్య (19)లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గదుల్లో వీరంతా ఆత్మహత్య చేసుకున్నారు. సౌమ్య ఇటీవలే అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Mancherial District
Family
Suicide

More Telugu News