Khammam District: ఆరేళ్ల బాలికపై లైంగికదాడి కేసు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఖమ్మం కోర్టు

20 year jail to culprit who raped 6 year old girl in khammam
  • రెండేళ్ల క్రితం నాటి కేసులో తీర్పు
  • మేస్త్రీ పనికోసం వచ్చి బాలికపై లైంగికదాడి
  • పోక్సో చట్టం కింద కేసు విచారణ  
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఖమ్మం ఒకటో ప్రత్యేక పోక్సో (ఫాస్ట్ ట్రాక్) కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని దుందిరాలపాడుకు చెందిన గరేళ్లి కొండయ్య మేస్త్రీ పనికోసం 2018లో మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, విచారించిన న్యాయస్థానం కొండయ్యను దోషిగా తేల్చింది. న్యాయమూర్తి డానీరుత్ నిన్న కొండయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
Khammam District
POCSO Court
Telangana

More Telugu News