Hyderabad: పంతంగి టోల్ ప్లాజా వద్ద రూ.11.63 కోట్ల విలువైన బంగారం పట్టివేత

DRI Officials Seize 25 Kg Gold at Pantangi Toll Plaza
  • అసోం నుంచి హైదరాబాద్‌కు కారులో తరలింపు
  • కారు ఎయిర్ బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు
  • ముగ్గురు నిందితుల అరెస్ట్
అసోంలోని గువాహటి నుంచి హైదరాబాదుకి కారులో పెద్దఎత్తున తరలిస్తున్న బంగారాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. మొత్తం రూ. 11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి తెప్పించిన ఈ బంగారాన్ని హైదరాబాద్‌లోని వివిధ దుకాణాల్లో ఇచ్చేందుకు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

కారు ఎయిర్ బ్యాగ్‌లో బంగారాన్ని ఉంచి రవాణా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.  కారును సీజ్ చేసి, నిందితులు ముగ్గురిని హైదరాబాద్‌లోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. బంగారం విదేశాల నుంచి వీరికి ఎలా వచ్చింది? హైదరాబాద్‌లో ఏయే దుకాణాలకు వీరు తరలిస్తున్నారన్న కోణంలో విచారిస్తున్నారు.
Hyderabad
Assam
Gold Biscuits
Pantangi Toll Plaza

More Telugu News