బాలీవుడ్ సినిమాలో మెగా బ్రదర్!
- హిందీలో 'ఛత్రపతి' సినిమా పునర్నిర్మాణం
- హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ
- బాలీవుడ్ కి పరిచయం అవుతున్న వినాయక్
- విలన్ పాత్రకు ఎంపికైన నాగబాబు
తెలుగులో సూపర్ హిట్టయిన 'ఛత్రపతి' చిత్రాన్ని యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో నాగబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో విలన్ పాత్రకు నాగబాబును చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఈ పాత్ర చేయడానికి నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చు!