Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం.. సోదరుడు కృష్ణమోహన్ రావు మృతి

Premiere Director Raghavendra Rao Borther Dies of Lungs Ailment
  • ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై పలు సినిమాల నిర్మాణం  
  • కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యలు
  • రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం అలముకుంది. ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన రావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఆయన వయసు 81 సంవత్సరాలు. కృష్ణ మనోహర్ రావుకు ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిలింనగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Raghavendra Rao
Krishna Mohan Rao
Tollywood
RK Films

More Telugu News