Virat Kohli: మ‌రే విజ‌య‌మూ నిన్నటి వ‌న్డే విజ‌యానికి సాటి రాదు: కోహ్లీ

kohli praises team inda
  • ఈ మధ్య కాలంలో మా‌కు ద‌క్కిన‌ గొప్ప విజయం ఇదే 
  • శిఖ‌ర్ ధావ‌న్, రాహుల్‌ అద్భుతంగా రాణించారు 
  • ధావ‌న్ చేసిన 98 పరుగులు చాలా గొప్పవన్న కోహ్లీ
ఇంగ్లండ్‌పై గెలిచి ఇటీవ‌లే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న టీమిండియా తాజాగా జ‌రిగిన తొలి వ‌న్డేలోనూ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంపై టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. తాము తిరిగి పుంజుకోవడం అద్భుతమేన‌ని అన్నాడు.

ఈ మధ్య కాలంలో త‌మ‌కు ద‌క్కిన‌ గొప్ప విజయం ఇదేన‌ని చెప్పాడు. మ‌రే విజ‌య‌మూ దీనికి సాటి రాద‌ని వ్యాఖ్యానించాడు. ఈ వ‌న్డేలో భారీ విజయం సాధించ‌డం ప‌ట్ల తాను గ‌ర్విస్తున్న‌ట్లు చెప్పాడు. శిఖ‌ర్ ధావ‌న్, రాహుల్‌ అద్భుతంగా రాణించార‌‌ని తెలిపాడు.

తుది జట్టులో చోటు దొరకనపుడు కూడా ధావన్ చాలా ఉత్సాహంగా ఉంటాడని, ఎప్పుడూ నిరాశ చెందడని విరాట్ కోహ్లీ చెప్పాడు. నిన్న ధావ‌న్ చేసిన 98 పరుగులు స్కోరు బోర్డులో కనిపించిన అంకెల కంటే చాలా గొప్పవని ప్ర‌శంసించాడు.

రాహుల్‌పై  పెట్టుకున్న నమ్మకం నిజమైందని, టీమిండియాకు అవసరమైనపుడు విలువైన పరుగులు చేశాడని  విరాట్ కోహ్లీ చెప్పాడు. టీమిండియాలో అందరూ అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు.
Virat Kohli
Cricket
kl rahul
shikar dhavan

More Telugu News