Twitter: ట్విట్టర్ లో వచ్చిన తొలి ట్వీట్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న బ్రిడ్జ్ ఒరాకిల్ సీఈఓ

  • ఈ నెల 21కి ట్విట్టర్ కు 15 ఏళ్లు
  • "జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్" అంటూ తొలి ట్వీట్
  • ఓ వెబ్ సైట్ ద్వారా అమ్మకం
  • రూ.21 కోట్లకు కొనుగోలు చేసిన సీనా ఎస్టావీ
Huge price for first tweet in Twitter

సామాజిక మాధ్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ట్విట్టర్ రంగప్రవేశం చేసి మార్చి 21కి 15 ఏళ్లయింది.  సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ట్విట్టర్ లో మొట్టమొదటి ట్వీట్ చేశారు. "జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్" అంటూ జాక్ డోర్సీ ట్వీట్ తో మొదలైన ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, తాను ట్విట్టర్ లో చేసిన మొదటి ట్వీట్ ను జాక్ డోర్సీ 'వాల్యూబుల్స్ బై సెంట్' అనే వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టగా, కళ్లు చెదిరే భారీ ధర లభించింది.

ఈ ట్వీట్ ను కొనుగోలు చేసేందుకు భారీగా పోటీ పడ్డారు. చివరికి బ్రిడ్జ్ ఒరాకిల్ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ రూ.21 కోట్లు చెల్లించి జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ అనే అపురూపమైన ట్వీట్ ను సొంతం చేసుకున్నారు. కాగా, ఈ ట్వీట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చుతానని, 'గివ్ డైరెక్టీస్ ఆఫ్రికా రెస్పాన్స్' అనే ఎన్జీవోకు విరాళంగా అందిస్తానని జాక్ డోర్సీ వెల్లడించారు.

More Telugu News