Microsoft: ప్రముఖ మెసేజింగ్​ సైట్​ పై మైక్రోసాఫ్ట్​ కన్ను!

  • డిస్కార్డ్ ను కొనుగోలు చేసే ప్రయత్నాలు
  • వెయ్యి కోట్ల డాలర్ల డీల్ పై చర్చలు
  • ఐపీవోకు వెళ్లాలనుకుంటున్న డిస్కార్డ్?
Microsoft In 10 Billion Dollars Talks To Acquire This Business

ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ పై మైక్రోసాఫ్ట్ కన్నేసింది. సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వెయ్యి కోట్ల డాలర్లతో దానిని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే చర్చలు జరిపిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ అందులో ముందు వరుసలో ఉందని చెబుతున్నారు. అయితే, వేరే కంపెనీలకు సంస్థను అమ్మే బదులు.. ఐపీవోకు వెళ్లాలని డిస్కార్డ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే, సంస్థ విక్రయానికి సంబంధించి ఇప్పటికే పలు పార్టీలతో డిస్కార్డ్ చర్చలు జరిపిందనీ చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. ఇటు డిస్కార్డ్ కూడా స్పందించలేదు. గత ఏడాది డిసెంబర్ నాటికి డిస్కార్డ్ సంస్థ విలువ దాదాపు 700 కోట్ల డాలర్లుగా ఉంది. కంపెనీ విలువను పెంచుకునేందుకు జెనిమ్యాక్స్ మీడియాను 750 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసింది. కాగా, డిస్కార్డ్ ను గేమ్స్, చర్చలు, వర్చువల్ పార్టీలపై బృంద సమన్వయం కోసం ఎక్కువగా వాడుతుంటారు. ప్రముఖ గేమ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది కూడా డిస్కార్డే.

అయితే, ఇప్పటికే లింక్డ్ ఇన్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫాంను 2016లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసినా.. అది కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడం, మామూలు జనం వాడుకోలేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో.. జనం అందరూ వాడుకునే ఓ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది.

More Telugu News