Mongoose: అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అంతుచూసిన ముంగిస... వీడియో వైరల్

  • పాము, ముంగిస మధ్య జాతి వైరం
  • పరస్పరం పోరాడే వన్యప్రాణులు
  • కింగ్ కోబ్రాతో ముంగిస పోరు
  • తప్పించుకునేందుకు చెట్టెక్కిన పాము
  • మెడను దొరకబుచ్చుకున్న ముంగిస
Mongoose kills King Cobra in a fierce battle

పాము-ముంగిస వైరం తెలిసిందే. ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడితే మాత్రం భీకర యుద్ధం తప్పదు. అయితే ఒక ముంగిస ఏకంగా కింగ్ కోబ్రా వంటి అత్యంత ప్రమాదకరమైన పామును చంపడం నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రా భూమిపై అత్యంత విషపూరితమైన పాము. ఏడడుగులకు పైగా పొడవుతో భీతిగొలిపే రూపుతో కింగ్ కోబ్రా తన ప్రత్యేకతను చాటుకునే సర్పం. అయితే, ఓ ముంగిసతో జరిగిన పోరులో ఇంతటి విషసర్పం సైతం ప్రాణాలు పోగొట్టుకుంది.

ముంగిసతో పోరు సందర్భంగా నేలకు తక్కువ ఎత్తులో ఉన్న ఓ చెట్టుకొమ్మపైకి కింగ్ కోబ్రా చేరగా, ముంగిస ఎంతో నేర్పుగా ఆ పాము మెడను నోట కరుచుకుని పొదల్లోకి లాక్కుని వెళ్లింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. కింగ్ కోబ్రా తనను కాటు వేయకుండా, ముంగిస కచ్చితంగా దాని మెడను చేజిక్కించుకోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News