ఈ పాపం ఆయన్ను ఊరికే వదలదు... ఆత్మకూరు కూల్చివేతల అంశంలో నారా లోకేశ్ ఆగ్రహం

22-03-2021 Mon 16:04
  • ఆత్మకూరు గ్రామంలో నిర్మాణాల కూల్చివేత
  • అక్రమ నిర్మాణాలంటున్న అధికారులు
  • పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చివేశారన్న లోకేశ్
  • ఎమ్మెల్యే ఒత్తిడితో కూల్చివేశారని ఆరోపణ
  • ప్రజలను కట్టుబట్టలతో రోడ్డుమీదికి నెట్టేశారని ఆవేదన
Nara Lokesh fires in Athmakur issue
మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో అక్రమ నిర్మాణాల పేరిట పేదల ఇళ్లను కూల్చివేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆత్మకూరు గ్రామంలో ఇళ్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడిరోడ్డు మీదకు నెట్టేశారని లోకేశ్ విమర్శించారు. ఈ పాపం ఆయన్ను ఊరికే వదలదని హెచ్చరించారు. ఈ క్రమంలో నిర్మాణాల కూల్చివేత వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.