Pothina Venkata Mahesh: వీరిద్దరి వల్ల వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది: జనసేన నేత పోతిన

YSRCP govt will collapse due to Vellampalli says Janasena leader Pothina
  • చింతమనేని, వనజాక్షి వ్యవహారం వల్ల టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది
  • వెల్లంపల్లి, దుర్గ గుడి ఈవో వల్ల వైసీపీ ప్రభుత్వం పతనమవుతుంది
  • అమ్మవారి డబ్బులు, ఆలయ భూములను కాజేశారు
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాడు చింతమనేని ప్రభాకర్, ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారం టీడీపీ ప్రభుత్వ పతనానికి కారణమైందని, అలాగే ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గ గుడి ఈవో సురేశ్ బాబు అవినీతి వల్ల వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.

అన్యాయానికి అండగా ప్రభుత్వం నిలబడితే... చరిత్ర పునరావృతం అవుతుందని తెలిపారు. అమ్మవారి డబ్బులు, ఆలయాల భూములను వెల్లంపల్లి అడ్డంగా దోచుకున్నారని చెప్పారు. వెల్లంపల్లితో తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తే వైసీపీ ఓడిపోతుందని... అందుకే ప్రచారం చేసే వారి జాబితాలో ఆయన పేరును చేర్చలేదని తెలిపారు.
Pothina Venkata Mahesh
Janasena
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP

More Telugu News