Telugu Academy: సుప్రీంకోర్టుకు చేరిన తెలుగు అకాడమీ విభజన అంశం

Telangana government goes to supreme court over Telugu Academy division issue
  • ఇంకా పరిష్కారం కాని తెలుగు అకాడమీ విభజన
  • న్యాయస్థానంలోనే పరిష్కారం అన్న తెలంగాణ హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
  • అకాడమీ విభజన న్యాయపరిధిలోకి రాదంటూ పిటిషన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పాటైన తెలుగు అకాడమీ విభజన అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2014లో ఏపీ, తెలంగాణ విడిపోయినా... తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడీ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవలే ఉద్యోగుల పంపకం, ఆస్తులు-అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి వ్యవహారాలకు న్యాయస్థానాల్లోనే పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది.

అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని తన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగు అకాడమీ పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని నెలరోజుల్లో ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఒకవేళ ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు తాము విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
Telugu Academy
Division
Supreme Court
Telangana Government
High Court
Telangana
Andhra Pradesh

More Telugu News