Ceter: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ సందర్భంగా రూ. 10 వేల అడ్వాన్స్!

Center announces advance to Central govt employees fo Holi festival
  • హోళీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చిన కేంద్రం
  • అడ్వాన్స్ తీసుకునేందుకు మార్చి 31 చివరి తేది
  • నెలకు రూ. 1000 చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోళీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు రూ.10వేలు అడ్వాన్సుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో హోళీ జరగనుంది. ఈ క్రమంలో హోళీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అడ్వాన్సు తీసుకునేందుకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది.

అడ్వాన్సు తీసుకున్న ఉద్యోగులు నెలకు రూ. 1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. డబ్బు అవసరమున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న మూడు విడతల డీఏ, డీఆర్ ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది.
Ceter
Holi
Advance

More Telugu News