Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Uttarakhand CM Tirath Singh Rawat tested positive for Corona
  • దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు 
  • టెస్టుల్లో తనకు కరోనా అని తేలిందన్న రావత్  
  • తాను ఆందోళన చెందడం లేదన్న సీఎం
దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం భావిస్తోంది. పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది.

తనకు నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని... ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని... డాక్టర్లు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంతో తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. మరోవైపు ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన పతాకశీర్షికల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే.
Tirath Singh Rawat
Corona Positive
Uttarakhand

More Telugu News