Jhanvi Kapoor: ‘ముద్దిస్తావా?’ అని అడిగిన అభిమాని.. దిమ్మతిరిగే బదులిచ్చిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor has a solid response to fans request for a kiss
  • మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్
  • దానిపై ‘నో’ అని జవాబు
  • అభిమానులతో ఇన్ స్టాలో ముచ్చట్లు
జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని బాలీవుడ్ లో దూసుకుపోతోంది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం ఆమె అభిమానులతో తన ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించారు. తనకు ఇష్టమైన వాటి గురించి వారితో పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు.

అందులో భాగంగా ఓ అభిమాని ‘నాకు ముద్దిస్తావా?’ అని అడిగాడు. దీంతో ఆ ప్రశ్నకు తగ్గట్టే ఆమె దిమ్మతిరిగిపోయే జవాబిచ్చింది. మొహానికి మాస్క్ పెట్టుకుని తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసి ‘నో’ అని సమాధానం చెప్పింది.
 

తనకు ఇష్టమైన షో 'షిట్స్ క్రీక్' అని, ఐస్ క్రీం అంటే ప్రాణమని, రోజూ నాలుగు కప్పుల దాకా లాగించేస్తానని చెప్పుకొచ్చింది.


సెట్స్ లో ఫ్యాటీ కపూర్ (లావైన కపూర్) అని పిలిస్తే ఎలా ఉంటుందని మరో అభిమాని ప్రశ్నించగా.. సరదాగా అనిపిస్తుందని సమాధానం చెప్పింది. ఒడిలో రెండు ప్లేట్ల నిండా ఆహారం పెట్టుకుని తింటున్న ఫొటోను పోస్ట్ చేసింది.

Jhanvi Kapoor
Bollywood
Mask

More Telugu News