షోపియాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ‘లష్కరే’ ఉగ్రవాదుల హతం
- మనిహాల్ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు
- సీఆర్‌పీఎఫ్, సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్
- కొనసాగుతున్న గాలింపు
గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.