Manthena Satyanarayana Raju: మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ

TDP MLC Mantena Sathyanarayana Raju warns AP minister Kodali Nani
  • ఇటీవల చంద్రబాబు, లోకేశ్ పై కొడాలి నాని వ్యాఖ్యలు
  • నానిపై విరుచుకుపడిన మంతెన సత్యనారాయణరాజు
  • సంస్కార హీనులు అంటూ ఆగ్రహం
  • నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని వార్నింగ్
ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెధవల సంఘం గనుక ఏర్పాటు చేస్తే ఎలాంటి పోటీ లేకుండా కొడాలి నాని ఏకగ్రీవంగా ఎన్నికవుతాడని ఎద్దేవా చేశారు.

తాగి నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. లోకేశ్ మంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని, అలాంటి వ్యక్తిని సంస్కార హీనులు విమర్శిస్తున్నారని మంతెన వ్యాఖ్యానించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఎవరి కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకున్నావు? అంటూ నిలదీశారు.
Manthena Satyanarayana Raju
Kodali Nani
Nara Lokesh
Chandrababu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News