నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి చంద్రబాబు, లోకేశ్ విరాళం

21-03-2021 Sun 16:38
  • నేడు నారా దేవాన్ష్ పుట్టినరోజు
  • నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళం
  • 30 లక్షల చెక్ ను పంపించిన వైనం
  • ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం
Nara family donates TTD on Devansh birthday

నారా లోకేశ్ తనయుడు, చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారావారి కుటుంబం టీటీడీకి విరాళం ప్రకటించింది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమం కోసం రూ.30 లక్షల విరాళం చెక్ ను టీటీడీ వర్గాలకు పంపింది. దేవాన్ష్ పుట్టినరోజును గత నాలుగేళ్లుగా నారా ఫ్యామిలీ తిరుమల శ్రీవారి సన్నిధిలోనే జరుపుకుంటోంది. అయితే ఈసారి పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రతి ఏడాదీ దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే ఖర్చును నారా కుటుంబ సభ్యులు విరాళంగా అందిస్తున్నారు.