Aditya Thackeray: కరోనా బారినపడ్డ మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే

  • మహారాష్ట్రలో తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి
  • తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానన్న థాకరే
  • కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని వెల్లడి
  • తనను కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచన
Aditya Thackeray get infected by corona

దేశంలో కరోనా ప్రభావంతో తల్లడిల్లుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రభాగాన ఉంటుంది. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. కరోనా సోకిన విషయాన్ని ఆదిత్య థాకరే స్వయంగా వెల్లడించారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు.

ఇటీవల తనను కలిసినవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం తొలగిపోలేదని స్పష్టం చేశారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్ పూర్ లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో ఇక్కడ లాక్ డౌన్ ను మార్చి 31 వరకు పొడిగించారు.

More Telugu News