టీటీడీ కల్యాణమస్తు.. పెళ్లితో ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్లు!

20-03-2021 Sat 08:23
  • గ్రాము తాళిబొట్టు తయారీలో ఇబ్బందులు
  • రెండు గ్రాముల సూత్రానికి ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్
  • మరికాసేపట్లో ఏప్రిల్ కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
TTD To Give 2 Gram Mangal Sutra To Poor Couple Who Tied in Kalyanamastu

కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు రెండు గ్రాముల తాళిబొట్లు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. నిజానికి గ్రాము బరువున్న మంగళసూత్రాన్ని ఇవ్వాలని టీడీడీ తొలుత నిర్ణయించినప్పటికీ అంత తక్కువ బరువులో తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తాళిబొట్టు బరువును రెండు గ్రాములకు పెంచింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో ప్రారంభం కానున్న కల్యాణమస్తు కార్యక్రమంలోనే వీటిని పేద జంటలకు ఇవ్వనున్నారు.

మరోవైపు, వచ్చే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే, అద్దె గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.