Japan: ఇన్నాళ్లూ యువతి అనుకున్న వ్యక్తి పురుషుడు అని తేలింది.. నిరాశకు గురైన ఫాలోవర్లు

  • సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్ల కోసమే
  • ఎడిటింగ్‌లో అమ్మాయి మొహంతో మార్పు
  • గుట్టు రట్టు చేసిన ఓ తెలివైన ఫాలోవర్‌
  • అతడు నిజంగానే అమ్మాయి కాదని నిర్ధారించిన టీవీ ఛానెల్‌
A woman biker is actually A man

జపాన్‌లో విశేష ఆదరణ పొందిన ఓ మహిళా బైకర్‌కు రోజురోజుకీ అభిమానులు పెరిగిపోయారు. ఆమెను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అయ్యేవారి సంఖ్యా పెరిగింది. అయితే, తీరా చూస్తే ఆ వ్యక్తి 'ఆమె' కాదని.. 'అతడు' అని తెలిసి షాక్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే...  ల్యాడ్‌బైబిల్‌ అనే వ్యక్తి ఓ బైకర్‌. అతనికి ట్విటర్‌ ఖాతాలో 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు తనని తాను అమ్మాయిగా పరిచయం చేసుకొని అందుకనుగుణంగా ఫొటోలు పెట్టి ఫాలోవర్లను పెంచుకున్నాడు. అదంతా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేటప్పుడు తన ముఖాన్ని అమ్మాయి ముఖంతో మార్చి షేర్‌ చేసేవాడు. ఇదే అతనికి వేలాది మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. అయితే ఓ తెలివైన ఫాలోవర్‌ గుట్టును రట్టు చేశాడు.

వెనకాల ఉండే అద్దంలో మాత్రం అసలు రూపం కనిపించడం అతడు గుర్తుపట్టాడు. వెంటనే ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది అక్కడ చర్చనీయాంశంగా మారింది. రంగంలోకి దిగిన ఓ టీవీ ఛానెల్‌ ఈ విషయంపై పరిశోధన మొదలుపెట్టింది. అమ్మాయి వేషంలో ఉన్న ల్యాడ్‌బైబిల్‌ను కనిపెట్టింది. భుజాల వరకు జుట్టు పెంచుకున్న అతను 50 ఏళ్ల పురుషుడని గుర్తించింది.

More Telugu News