America: భారత్‌ చేరుకున్న అమెరికా రక్షణ మంత్రి

  • మూడు రోజుల పర్యటన
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ
  • అజిత్‌ దోవల్‌, జైశంకర్‌తోనూ సమావేశమయ్యే అవకాశం
  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, ఆఫ్ఘనిస్థాన్‌ శాంతి ప్రక్రియ వంటి అంశాలపై చర్చ
Lloyd Austin Arrives in India

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మూడురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అంశాలపై మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర భారత ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, ఆఫ్ఘనిస్థాన్‌ శాంతి ప్రక్రియ వంటి పలు కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణరంగంలో ఉభయదేశాల సహకారాన్ని మరింత బలోపేతం దిశగానూ చర్చలు జరగొచ్చని సమాచారం.  

ఈ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ లాయిడ్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పదవి చేపట్టిన తర్వాత ఆయన కేబినెట్‌లోని ఓ ఉన్నతాధికారి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా చైనాతో భారత్‌ సంబంధాలు క్షీణించిన వేళ ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని ఇటీవల జరిగిన క్వాడ్‌ సదస్సులో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన దాని కొనసాగింపుగానే జరుగుతోందని భావిస్తున్నారు.

More Telugu News